తెలంగాణ లో ప్రస్తుతం ప్రతిపక్ష బీఆర్ఎస్-అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో హైడ్రా, మూసీ ప్రక్షాళన, రుణమాఫీ వంటి అంశాలపై బీఆర్ఎస్ నేతలు నిత్యం స్పందిస్తున్నారు. వారికి కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్లు వేస్తున్నారు. ఇలా వాదనలు, ప్రతివాదనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఖబర్దార్.. విమర్శలు మానుకోక పోతే నాలుక కోస్తాం అని హెచ్చరించారు. తెలంగాణా లో ప్రజా పాలనకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయి. ప్రతి నిత్యం అప్పులను ఎలా తీర్చాలి..? నిధులు ఎలా తెచ్చుకోవాలి అని సీఎం ప్రయత్నం చేస్తుంటే..కేటీఆర్ ఇప్పటికి 20 సార్లు ఢిల్లీ వెళ్లిండు అని మాట్లాడుతున్నారు. కేటీఆర్ సిగ్గు శరం ఉండే మాట్లాడుతున్నావా..? రాష్ట్రానికి కావాల్సిన అవసరాల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంటే..కేటీఆర్ ఆయనకు ఉన్న కల్చర్ అందరికి ఉంటాయనుకుంటాడు. పబ్బుల కల్చర్ నీది కేటీఆర్. 20 సార్లు కాదు కేటీఆర్ 230 సార్లు పోతాడు. ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి పక్ష హోదా ఇస్తే.. మీ నాయన కడుపుల సల్ల కదలకుండా ఫామ్ హౌస్ లో పండుకుండు అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీర్ల ఐలయ్య.