అమ‌రావ‌తి ఫోక‌స్ రోజుకో ర‌కంగా.. టీడీపీ వ్యూహం స‌క్సెసా.. ఫెయిలా…?

-

నిర‌స‌న‌, ఆందోళ‌న అంటేనే గిట్ట‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఇప్పుడు గ‌డిచిన 20 రోజులుగా ఆందోళ‌న లతో బిజీగా మారిపోయారు. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌నా, నిర్ణ‌యం తీసుకోక‌ముందుగానే ఆయ‌న అలెర్ట్ అయిపోయారు. రోజుకో రూపంలో ఆందోళ‌న‌ల‌ను కొన‌సాగి స్తున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను క‌లుపుకొని పోతూ.. ఆయ‌న భిన్న‌శైలిలో స్పందిస్తున్నారు. ఇది స‌క్సెస్ అవుతుందా? ఫెయిల‌వుతుందా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. భిన్న‌మైన మ‌న‌స్త‌త్వం ఉన్న‌వారిని ప్ర‌స్తుతానికి చంద్ర‌బాబు ఒకే తాటిపైకి తీసుకురావ‌డం మాత్రం స్ప‌ష్టంగా క‌నిపించింది.

తొలిరోజు.. నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆందోళ‌న‌లు భిన్న‌మైన రీతిలో న‌డుస్తున్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌జ ల స్లోగ‌న్లు కూడామారాయి. ఆదిలో రైతుల సెంటిమెంటును ప్ర‌తి ఒక్క‌రూ భుజాన వేసుకున్నారు. రాజ‌ధా నికి 33 వేల ఎక‌రాల‌ను ఎలాంటి ష‌ర‌తులు లేకుండా ఇచ్చిన రైతుల‌కు అన్యాయం చేస్తారా? అంటూ రైతు ల‌ను రంగంలోకి దించారు. దీంతో ప్ర‌భుత్వం వెంట‌నే రైతుల‌కు న్యాయం చేసేందుకు తాము సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించింది. అనంత‌రం, మ‌హిళ‌ల‌ను రంగంలోకి తెచ్చారు.

రాజ‌ధానిని త‌మ పుట్టిల్లుగా భావించామ‌ని, ఎట్టిప‌రిస్థితిలోనూ దీని ని వ‌దులుకునేది లేద‌న్నారు. దీంతో ప్ర‌భుత్వం ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షం దారి మ‌ళ్లిస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇక‌, మూడు రాజ‌ధానులు ఎవరు కోరుతున్నారంటూ.. విదేశాల్లో ఉన్న ఏపీ ప్ర‌జ‌ల‌ను కూడా చంద్ర‌బాబు లైన్‌లో పెట్టారు. అమెరికా స‌హా ఆస్ట్రేలియా వంటి చోట్ల నుంచి కూడా ఏపీ రాజ‌ధానికి మ‌ద్ద‌తుగా స్పంద న‌లు వ‌స్తున్నాయి. ఇక‌, అమ‌రావ‌తి ప్రాంతంలో ఒకే సామాజిక వ‌ర్గం లబ్ధి పొందుతోంద‌నే వ్యాఖ్య‌ల‌పైనా చంద్ర‌బాబు చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

ఆదిలో ఒకే సామాజిక‌వ ర్గం వ‌చ్చినా.. ఇప్పుడు మిగి లిన వారిని కూడా క‌దిలించారు. వారికి రాజ‌ధానితో ప్ర‌యోజ‌నాలుఉన్నాయో లేదో తెలియ‌దు కానీ.. ఇప్పు డు మాత్రం కొంత‌మేర‌కు మిగిలిన సామాజిక వ‌ర్గాలు వ‌స్తున్నాయి. ఇక‌, తుది అంకంలో చంద్ర‌బాబు ఏకం గా జోలెప‌ట్టారు. రాజ‌ధాని రైతుల‌కు అండ‌గా, ఉద్య‌మానికి అండ‌గా దీనిని వ‌సూలు చేస్తున్నామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే.. రాజ‌ధాని ఆందోళ‌న‌లు రోజుకోర‌కంగా మ‌లుపుతిరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news