బ్రేకింగ్; దర్బార్ సినిమాలో ఆ సీన్లు తొలగించారు…!

-

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదలైన దర్బార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రంలో కొన్ని వివాదాస్పద సన్నివేశాలను తొలగిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.

జైల్లో ఉన్నప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ షాపింగ్ చేయడానికి జైలు నుంచి బయటకు వచ్చినట్టు ఉన్న కొన్ని సన్నివేశాలు సినిమాలో వివాదాస్పదంగా మారాయి. ఈ నేపధ్యంలో సినిమాలో జైలు నుంచి బయటకు వెళ్ళే ఖైదీలకు సంబంధించిన సంభాషణలు కేవలం వినోదాన్ని అందించే ఉద్దేశంతోనే చేర్చబడ్డాయని, ఏ వ్యక్తిని ఉద్దేశించినవి కావు.

అయినా సరే కొంత మందిని బాధపెట్టినందున ఈ చిత్రం నుంచి వాటిని తొలగించాలని తాము నిర్ణయం తీసుకున్నామని లైకా ప్రొడక్షన్స్ పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో కామెడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ వసూళ్లు సాధించగా, తెలుగులో కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజని కాంత్ నటన విశేషంగా ఆకట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news