యాక్టివ్ మోడ్ లోకి కమలం పార్టీ.. ఇక అధికార పార్టీకి చుక్కలే..

-

తెలంగాణ కమలం పార్టీ నేతలు యాక్టివ్ మోడ్ లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించేలా ఉద్యమాలు చేసేందుకు సిద్దమవుతున్నారు.. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి.. పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు.. ప్రజా సమస్యలపై పోరాటాలు చెయ్యడం ద్వారా బలం పుంజుకోవాలని భావిస్తున్నారు.. నేతలందరూ ఒక్కటవ్వడంతో క్యాడర్ లో పుల్ జోష్‌ కనిపిస్తోంది..

తెలంగాణలో బిజేపీలో ఉండే నేతలందరూ సీనియర్లు.. ఒకరి మాట ఒకరు వినే పరిస్తితి ఇక్కడుండదు.. దీంతో గత కొద్దిరోజులుగా ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా ఉన్న నేతలు.. ఇప్పుడు ఒకతాటిపైకి వచ్చేశారు.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ సునీల్‌బన్సాల్ పర్యటన, నేతలతో కీలక సమావేశాల నేపథ్యంలో వారంతా ఏకమయ్యారు. దీంతో కమలం పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది.

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు సరైన అవకాశం కోసం ఎదరుచూస్తున్న ఆ పార్టీకి.. మూసీ అంశం దొరికింది.. దీంతొ దీనిమీద ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ ప్రకటించింది.. ఈ నెల 23,24 తేదీల్లో ధర్నా చేపట్టి అనంతరం పోరాటాలను మరింత ఉదృతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది..
మరోవైపు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కలిసిన బీజేపీ నేతల బృందం.. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం, హిందూ సంఘాలపై కేసుల నమోదుపై ఫిర్యాదు చేసింది.

ఎనిమిది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కల్గిన బిజేపీ.. గత ఎన్నికల్లో మంచి ఓటు షేర్ ను సాధించింది.. గెలవలేరనుకున్న చోట కూడా.. మంచి మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్దులు గెలుపొందారు.. అయితే అదికార కాంగ్రెస్ కు దిమ్మతిరిగేలా పోరాటాలు చెయ్యడంలేదని, నేతల మధ్య సమన్వయం లేదని పార్టీ క్యాడర్ భావిస్తుండేది.. ఈ నేపథ్యంలో కమలం నేతలందరూ ఒక్కటై.. పోరాటాలకు సిద్దమవుతూ ఉండటంతో.. క్యాడర్ లో కూడా పుల్ జోష్ కనిపిస్తోంది.. వ్యక్తిగత అజెండాలు లేకుండా.. పార్టీ అజెండామీదే నేతలు పనిచేసేలా అధిష్టానం కీలక ఆదేశాలు ఇచ్చిందట.. వారి ఆదేశాలను నేతలు ఎలా పాటిస్తారో భవిష్యత్ లో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news