Health: రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే మార్నింగ్ లేవగానే ఈ పనులు చేయండి

-

లేచిన వేళా విశేషం బాగుంటే అంతా బాగుంటుందని పెద్దలు చెబుతారు. ప్రస్తుతం నిపుణులు మాత్రం లేచిన తర్వాత నువ్వు ఏం చేశావన్న దాన్నిబట్టి రోజంతా ఎలా ఉండాలనేది డిసైడ్ అవుతుందని చెబుతున్నారు.

అవును. రోజంతా నువ్వు ఉల్లాసంగా, ఎనర్జిటిక్ గా, ప్రొడక్టివ్ గా ఉండాలంటే మార్నింగ్ లేచిన వెంటనే కొన్ని పనులు చేయాలి. ప్రస్తుతం అవేంటో తెలుసుకుందాం.

సమయానికి నిద్ర లేవడం :

ఒకరోజు మార్నింగ్ ఆరింటికి లేచి మరొక రోజు 8కి లేచి ఇంకో రోజు 9కి లేవకూడదు. దీనివల్ల శరీరానికి నువ్వు ఎంత నిద్రపోతున్నావనేది అర్థం కాదు. ప్రతీరోజూ ఒకే సమయానికి నిద్రలేవాలి. పండగలైనా, పబ్బాలైనా, ఆదివారాలైనా, ఎప్పుడైనా ఒకే సమయానికి నిద్రలేస్తే ఆ రోజంతా బాగుంటుంది.

ఆరోజు ఏం చేయాలో ముందు డిసైడ్ అవ్వండి

లేచిన వెంటనే ఆ రోజు ఏమేం పనులు చేయాలో లిస్ట్ రాసుకోండి. దీనివల్ల మీరు గజిబిజి పడకుండా సరైన దారిలో వెళతారు. అనవసర పనుల జోలికి వెళ్లకుండా ఉండడంవల్ల మీలో ప్రోడక్టివిటీ పెరుగుతుంది.

వ్యాయామం తప్పనిసరి

లేచిన తర్వాత కచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. కనీసం 30నిమిషాల పాటు వ్యాయామం చేయడం శరీరానికి మంచిది. వ్యాయామం శరీరానికి ఉత్తేజాన్ని, మనసుకు ఉల్లాసాన్ని కలిగించి ఆరోగ్యంగా ఉంచుతుంది.

స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండండి

ఈ మధ్యకాలంలో చాలామంది లేచిన వెంటనే చేతుల్లోకి మొబైల్ తీసుకుని ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటారు. ఇది అసలు మంచి పద్ధతి కాదు. మార్నింగ్ లేవగానే స్క్రీన్ కి దూరంగా ఉండండి. డిజిటల్ గ్యాడ్జెట్స్ ఉదయాన్నే వాడటం వల్ల మీరు అలసటగా ఫీల్ అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news