తెలంగాణ రాజకీయాల్లో లీగల్ వార్.. ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్న నేతలు..

-

తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా… పొలిటికల్ హీట్ మాత్రం చల్లారడం లేదు.. నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను పీక్స్ కు తీసుకెళ్తున్నారు. నేతల మధ్య మాటలు లీగల్ వార్ గా మారుతున్నాయి.. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..?

రాజకీయాల్లో విమర్శలు సహజం.. కొన్ని విమర్శలు సిద్దాంతపరంగా ఉంటే..మరికొన్ని వ్యక్తిగతంగా ఉంటాయి.. కానీ తెలంగాణలో ఇటీవల నేతలు చేస్తున్న విమర్శలు వ్యక్తిగత ప్రతిష్ట భంగం కల్గించేలా ఉంటాయి.. దీంతో నేతలు కోర్టును ఆశ్రయిస్తున్నారు.. పరువు నష్టం దావా అంటూ ప్రత్యర్దులను కోర్టుమెట్టెక్కిస్తున్నారు.. ఇప్పటికే కేటీఆర్ పలువురిపై పరువు నష్టం దావాలు వేయగా, ఆయనకు కూడా నోటీసులు అందాయి.. తాజాగా.. కేటీఆర్ బండి సంజయ్ పై పరువునష్టం దావా వేయనున్నట్లు తెలిపారు. తనకు వారంలోగా క్షమాపణలు చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. దీనికి బండి సంజయ్ సైతం కౌంటర్ ఇచ్చారు.

మాటల దాడిలో ముందుండే సీఎం రేవంత్.. ఆయన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంగా తెలంగాణాలో రాజకీయాలు నడుస్తున్నాయి.. వీరిద్దరి మద్య మాటల తూటాలు ఇంట్రస్టింగ్ గా ఉంటాయి.. ఓ వైపు నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటే.. లీగల్ వార్ కూడా అదే స్థాయిలో కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

కొందరు నేతలు తమపై ఇతరులు చేసే ఆరోపణలకు కౌంటర్‌గా లీగల్ నోటీసులు కూడా ఇస్తున్నారు. తెలంగాణలో కొంతకాలంగా ఈ లీగల్ నోటీసుల పర్వం గట్టిగానే సాగుతోంది. అయితే లీగల్ నోటీసులు ఇచ్చిన, తీసుకున్న నాయకుల జాబితాలో కేటీఆర్ పేరు ఎక్కువగా వినినిస్తోంది..తాజాగా బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని లేకపోతే లీగల్‌గా వెళ్తానని కేటీఆర్ వ్యాఖ్యానించారు.. కొండా సురేఖ మీద కోర్టుకు వెళ్లిన ఆయన.. తాజాగా బండి సంజయ్ విషయంలో కూడా లీగల్ గా వెళ్తానని ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news