జగన్ కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం కూటమి ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో ఉంటుంది. చంద్రబాబు రాజకీయ అక్రమ బంధాలు పెట్టుకోవటంలో ముందు ఉంటారు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్డీయేలో ఉన్నాను అని చెబుతూ ఇక్కడ కాంగ్రెస్ తో చెట్టా పట్టాలు వేసి చెలిమి చేస్తున్నారు. ఏపీలో వింత రాజకీయాలు అన్నీ కనపడుతున్నాయి. వైఎస్సార్ బ్రతికి ఉన్న సమయంలో సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు షర్మిల ఆమె భర్తకు కూడా వాటాలు ఉండాలి కదా. వైఎస్సార్ ఆ రోజునే షర్మిల అనిల్ పేర్లు డైరెక్టర్లు గా ఉండాలని చెబితే ఉండేవి కదా అని పేర్ని నాని అన్నారు.
అలాగే వైఎస్సార్ ఆశయాలు కొనసాగించాలని నిజంగా అనుకుంటే చంద్రబాబు తో కలిసి రాజకీయాలు చేస్తారా, కలిసి ప్రయాణం చేస్తారా అని ప్రశ్నించారు. ఇక ఆస్తుల వాటాల దగ్గర వైఎస్సార్ అభిమతం అని చెబుతున్నారు. కానీ వైఎస్ ను ప్రేమించే వారు అందరూ ఇప్పటికే చంద్రబాబును ద్వేషిస్తున్నారు అని పేర్ని నాని పేర్కొన్నారు.