బాలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్ !

-

బాలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో హీరో బాలకృష్ణ సినీ స్టూడియోకి భూకేటాయింపులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట సీఎం రేవంత్ రెడ్డి. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినీ స్టూడియోకు భూ కేటాయింపులపై సీఎస్‌కు ప్రతిపాదనలు పంపిందట రెవిన్యూ శాఖ. ఇక నేడుసిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4గంటలకు సెక్రటేరియట్ లో మీటింగ్ ఉంది.

CM Revanth Reddy’s overwhelming offer to Balayya

ఈ క్యాబినేట్ ఎజెండాలో… 317జీవో, కులగణన, ధరణి, కొత్త ఆర్‌వోఆర్‌ చట్టం, రైతుభరోసా,రైతు రుణమాఫీ,ధాన్యం కొనుగోలు పాలసీ,ఉద్యోగుల డీఏల అంశాలు ఉన్నాయని సమాచారం. మూసీ పునరుజ్జీవం,మంత్రుల సియోల్ పర్యటన, హైడ్రా, ఇందిరమ్మ ఇళ్లపైనా నిర్ణయం తీసుకోనున్నారు. సోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, స్పోర్ట్స్ పాలసీ, ఎకో టూరిజం పాలసీ లపై క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మూసీ పునరుజ్జీవం,హైడ్రా, కొత్త రెవెన్యూ చట్టం పై అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు..లేదా అఖిలపక్ష భేటీకి నిర్ణయించనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news