కలెక్టర్ పై జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..BRS కౌంటర్!

-

కాంగ్రెస్ నాయకులది నోరా మోరా? నోరు తెరిస్తే బూతులు అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాఖేష్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన జగ్గారెడ్డి కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.  యథా సీఎం తథా లీడర్ అన్నట్లుంది వీళ్ళ వ్యవహారం. ఒక మహిళా కలెక్టర్ గురించి ‘నేను ఫోన్ చేస్తే ఎత్తడం లేదు? ఆఫీసుకు రావడం లేదు. ఇంట్లో ఏం చేస్తుంది? మొగని పక్కన పడుకుందా అని పీఏకు ఫోన్ చేసి తిట్టిన. నాకు కోపం వస్తే ఇలాంటి మాటలే వస్తాయి’ అని అన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. 

బహిరంగంగా అలా మాట్లాడిండు అంటే కాంగ్రెస్ నాయకుల తలకు పొగరు ఎట్లా ఎక్కిందో అర్ధం చేసుకోవచ్చు. అసలు జగ్గా రెడ్డి ఎవరు కలెక్టర్ మీద అధికారం చెలాయించడానికి? సీఎం ఆ లేక మంత్రా లేక ఎమ్మెల్యేనా? అయినా అధికారులు కాంగ్రెస్ నాయకులకు ఏమైనా పాలేరులా? వాళ్ళు ప్రభుత్వానికి జవాబుదారీ తప్ప మీకు కాదు అన్నారు రాఖేష్ రెడ్డి. జగ్గారెడ్డి మాత్రం తనపై ట్రోలింగ్ చేస్తే.. బట్టలూడదీసి కొడతానని సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

Read more RELATED
Recommended to you

Latest news