జనగామలో భారీ అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న మంటలు

-

జనగామ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్ మాల్‌లో ప్రమాదవ శాత్తు మంటలు వ్యాపించాయి. విద్యుత్ ప్రమాదం వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.బట్టల షాప్ కావడంతో మంటలు శరవేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో షాపింగ్ మాల్‌లో ఎవరైనా ఉన్నారా అన్న విషయం ఇంకా తెలియ రాలేదు.

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అదించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది పక్క షాపులకు మంటలు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.మంటలు అదుపులోకి వచ్చాకే ఆస్తి నష్టంపై అంచనా వేయనున్నారు. కాగా, ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news