జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ పైన గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు క్లారిటీ ఇచ్చారు. అది ఫామ్ హౌస్ కాదని తన బామ్మర్ది… ఇల్లు అంటూ పేర్కొన్నారు కేటీఆర్. రాజకీయంగా మాకు సమాధానం చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని పేర్కొన్నారు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక.. మా బంధువులపై కుట్రలు చేస్తోందని రేవంత్ సర్కార్ పై ఆగ్రహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నిరంతరాయంగా పోరాటం చేస్తుందన్నారు. ఒక కుటుంబం.. తమ బంధువులతో దావత్ చేసుకోవడమే తప్పు అంటున్నారని వెల్లడించారు. అది ఫామ్‌హౌస్ కాదు.. అది నా బావమరిది రాజ్ పాకాల ఉంటున్న ఇల్లు అన్నారు. అది ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పారు. అసలు రేవ్ పార్టీ అంటే తెలుసా.. వృద్ధులు, చిన్నపిల్లలు కూడా అక్కడ ఉన్నారన్నారు. రేవ్ పార్టీ అని చెప్పి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.