పత్తి రైతుల కోసం మంత్రులు కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ.. పత్తి మాత్రం కొనడం లేదు అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రూ. 7521 కింట పత్తి కొంట మని మద్దతు ధర ప్రకటించారు. కానీ ఈ రాష్ట్రంలో ఏ పత్తి రైతును అడిగిన రూ.5,500 పత్తి అమ్ముకుంటున్న పరిస్థితి ఏ రైతుకు కూడా పత్తికి మద్దతు ధర రాకపోయినా ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడటం లేదు అన్నారు.
రూ.500 బోనస్ అన్నావు.. కనీసం రూ.7500 మద్దతు ధర కూడా రైతులకు రావడం లేదు. రాష్ట్రం అంతా రైతులు రోడ్డు ఎక్కుతుంటే.. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు. వడ్ల కొనుగోలుకు కొబ్బరికాయలు కొట్టుడే తప్ప.. రాష్ట్రంలో వడ్లు కొనే దిక్కు లేదు. రూ.2320 మద్దతు ధర రావాల్సిన వడ్లు రూ.1800, 1900 కు వరి పండించిన రైతులకు అన్యాయం చేస్తున్నావని హరీశ్ రావు పేర్కొన్నారు.