బీసీ కుల గణన పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీ నోట విన్నా ఓబీసీలకు అన్యాయం జరిగిందని అంటున్నాయి. ఇన్ని ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్నారు. ఇప్పుడు ఓబీసీ కులగణన వీళ్లకు గుర్తుకు వచ్చింది. బ్రిటీష్ కాలంలో కులగణన జరిగింది. జంతువులకు లెక్కలు ఉన్నాయి. 65 శాతం ఉన్న ఓబీసీల కులగణన ఎంతో తెలియదు.
ఓబీసీల కులగణన జరిగితే ప్రభుత్వాలపై తిరుగుబాటు వస్తుందని భయపడ్డారు. కులగణన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కులగణన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. బీహార్, మహారాష్ట్ర ఓబీసీ కులగణన చేస్తామంటే కేంద్రం ఒప్పుకోలేదు. ఓబీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలి. బీహార్‌లో 63.1 శాతం ఓబీసీలు ఉన్నట్లుగా కులగణనలో తేలింది. మండల్ కమీషన్ సిఫారసులను అమలు చేయాలి. దేశంలో అన్ని వర్గాల లెక్కలు ఉండాలి. కులగణన చేసే అధికారం రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణనపై ముందుకు వెళ్ళాలన్నారు.