ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయం రోజురోజుకి చాలా ఉత్కంఠతో సాగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్న అతి పెద్ద చాలెంజ్ అయితే రాజధాని ప్రాంతంలో రైతులను శాంతి పరచడం. జగన్ ప్రతిపాదన పెట్టిన తర్వాత మొదట్లో అంత వ్యతిరేకత కనిపించకపోయినా తర్వాత టిడిపి వారు ఆ ప్రాంత ప్రజలను బాగా రెచ్చగొట్టారు.
మరొక వైపు వైసిపి ప్రభుత్వం కూడా రాజధాని ఎందుకు తరలిస్తున్నారని సరైన వివరణ ఇవ్వడంలో విఫలమయి బాగా ఇబ్బందులు పడుతోంది.
అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అమరావతి ప్రాంతంలోని రైతులు నచ్చచెప్పే బాధ్యతను తీసుకోవాల్సిన ఆ ప్రాంత ఎమ్మెల్యేలు మరియు మంత్రులు ఘోరంగా విఫలమైన నేపథ్యంలో జగన్ వారందరికీ ఒక క్లాస్ పీకాడట.
ఎంతో మంది సీనియర్ నేతలు మరియు ఐదుగురు మంత్రులు కృష్ణ గుంటూరు జిల్లాల నుండి అతని మంత్రి వర్గంలో ఉనా కూడా సరిగ్గా పరిస్థితిని హ్యాండ్ చేయలేకపోతున్నారని ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకుని చర్చలు జరిపి ఉద్యమాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం లేదనే అసహనం జగన్ లో తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వారిని మంత్రి వర్గం నుంచి సాగనంపే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారట.