ఢిల్లీలో వాయు కాలుష్యం కట్టడికి కొత్త రూల్స్

-

దేవ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయింది. ఇప్పటికే సుప్రీంకోర్టు సైతం కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాన్ని పలు మార్లు ఆదేశించింది. అయినప్పటికీ చర్యలు శూన్యంగానే ఉన్నాయి. తాజాగా గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) ఢిల్లీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. వెంటనే ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ -2’ (గ్రాప్-2) ను అమల్లోకి తేవాలని సిఫారసు చేసింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) పరిధిలో మొత్తం 4 స్టేజీలు ఉన్నాయి. గ్రాప్-1 దశలో కాలుష్య నియంత్రణ కోసం 27 చర్యలను అమల్లోకి తేవాల్సి ఉంటుందని నొక్కి చెప్పింది.

గ్రాప్-2లో 11 చర్యలు తీసుకోవాలి.గ్రాప్-3 దశలో 11, గ్రాప్-4 దశలో 8 చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రాప్-2 దశతో ముడిపడిన చర్యలను అమలు చేయాలని తాజాగా ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఏక్యూఎం కోరింది. యంత్రాలతో రోడ్లను ఊడ్పించడం, వాతావరణంలో పొగమంచు అత్యధికంగా ఉండే సీజన్లలో యాంటీ స్మోక్ గన్లను వినియోగించాలని కోరింది. డీజిల్ జనరేటర్ల వినియోగంపై ఆంక్షలు విధించాలని స్పష్టంచేసింది. వాహనాల పార్కింగ్ ఛార్జీలను పెంచడం, బాణాసంచా నిల్వ, క్రయవిక్రయాలపై నిషేధం విధించాలని ఢిల్లీ సర్కారును సీఏక్యూఎం కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news