మనకు ఉన్న అవయవాలు అన్నీ చాలా ముఖ్యమైనవే. ప్రతీ అవయవం కరెక్టుగా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఇక గుండె విషయానికి వస్తే.. దీనికి ఏదైనా సమస్య వస్తే కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. అయితే సెకనులో వచ్చే గుండెపోటు మనిషి ప్రాణాలను తీస్తుంది. అయితే గుండెపోటుకు ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వీటిని గమనిస్తే ముందే జాగ్రత్త పడొచ్చు. మరి ఆ లక్షణాలేంటో తెలుసా?
గుండె జబ్బుకు సంబంధించిన లక్షణాలు ఇతర వ్యాధులలాగానే ఉంటాయి. గుండెపోటుకు ముందు ఛాతిలో నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆహరం సరిగ్గా తీసుకోకపోవడం..ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వంటివి గుండెపోటుకు కారణాలుగా చెప్పవచ్చు.
ఇక చాలా మంది గ్యాస్ట్రిక్, అసిడిటీ వల్ల కడుపు నొప్పి వస్తుంది. అయితే కడుపు మధ్య భాగంలో మంట, నొప్పి గుండెజబ్బులకు కారణం అవుతుంది.
గుండెపోటు వచ్చే ముందు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. ఛాతిలో నొప్పిగా ఉండడంతో పాటు చిన్న పనులకే నీరసంగా అనిపిస్తుంది.
కొద్దిసేపు నడిచినా ఆయాసం వస్తున్నా గుండె విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి ఇబ్బంది ఉన్న వైద్యుడిని సంప్రదించడం మంచిది.
అయితే మంచి ఆహారం తీసుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉంటే గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అలాగే ప్రతో రోజు వర్కౌట్, ధ్యానం, ప్రాణామాయం, యోగా వంటివి చేయాలని సూచిస్తున్నారు.
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే మీరు జీవనశైలిపై దృష్టిపెట్టండి. రోజూ ఎలాంటి ఆహారం తింటున్నారు. జంక్ ఫుడ్ వారానికి ఎన్నిసార్లు అవుతుంది. ఆల్కాహాల్, సిగిరెట్ లాంటి అలవాట్లు ఉంటే అవి ఏ రేంజ్లో ఉన్నాయో మీకు మీరే చూసుకోండి. ఆరోగ్యంగా ఉండమని, బరువు తగ్గమని అందరూ చెప్తారు. కానీ మీ అంతట మీరు అనుకోకపోతే ఆ పని సాధ్యం కాదు. హైట్‌కు తగిన బరువు ఉండేలా చూసుకుంటే చాలు.!