వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు ఎవరి ఊహాలకు అందవ్.. ఆయన ఏం చేసినా.. ముందు చూపుతో చేస్తారు..పార్టీ బలోపేతం కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా డేరింగ్ ఉంటాయి.. ఎంపీటీసీలను, జడ్పీటీసీలను,లారీ డ్రైవర్లను ఎమ్మెల్యేలు గా చేసిన రికార్డు జగన్ స్వంతం.. అలాంటి జగన్.. రాజకీయంగా తనకు ఊపిరి పోసిన స్వంత జిల్లాపై దృష్టి పెట్టారు..
కడపజిల్లా వైఎస్సార్సీపీకి కంచుకోటలాంటింది.. గత ఎన్నికల్లో కూటమి దెబ్బకు బీటలు వాలింది.. 10 అసెంబ్లీ౩ సీట్లకు గానూ..నాలుగు చోట్ల మాత్రమే గెలుపొంది.. ఈ క్రమంలో పార్టీ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. ఈ జిల్లాలో పాగా వేసేందుకు కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టడంతో.. జగన్ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది..
పార్టీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్లినా.. కార్యకర్తలకు అందుబాటులో లేరు.. రాష్టంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ తక్కువ టైమే గడిపారు.. దీంతో ఈసారి మూడురోజుల పాటు అక్కడే ఉండేలా జగన్ ప్లాన్ చేసుకున్నారు.. ఈమూడు రోజులు పార్టీ నేతలతోపాటు.. ప్రజలతో ఆయన మమేకం అవ్వబోతున్నారు.. ప్రజల నుంచి విజ్ణప్తులు స్వీకరించడంతోపాటు.. ముఖ్యనేతలతో ఆయన భేటీ అవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి.. పార్టీని డ్యామేజ్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ క్రమంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు వైసీపీ అధినేత సిద్దమైనట్లు తెలుస్తోంది.. కుటుంబ వ్యవహారాలు కూడా రచ్చకెక్కిన నేపథ్యంలో ఈయన పులివెందుల పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇది కేవలం పొలిటికల్ టూర్ మాత్రమేనని వైసీపీ చెబుతోంది.. మొత్తంగా జగన్ మరో స్టాటజీని అమలు చేసేందుకే పులివెందులకు వెళ్లినట్లు పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది..