జగన్ కు కేంద్రం గుడ్ న్యూస్…!

-

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా విశాఖను చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్ర రైల్వే శాఖ విశాఖకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుంచి విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే రైల్వే కార్యాలయాలు అన్ని కూడా విశాఖ నుంచే పని చేసే విధంగా రైల్వే శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ రైల్వే కార్యాలయాలు అన్నీ కూడా ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ కింద,

సికింద్రాబాద్ నుంచి తమ కార్యాకలాపాలను కొనసాగిస్తున్నాయి. గత ఏడాది విశాఖ దక్షిణతీర రైల్వే జోన్ ఏర్పాటు కాగా ఇప్పుడు దాని కింద వచ్చే కార్యాలయాలు అన్నీ కూడా ఆ జోన్ కిందే పని చేయనున్నాయి. దీనితో సికిన్దాబాద్ కి ఏ సంబంధం ఉండదు. ఏపీ విభజన చట్టంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ని కేంద్రం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను కేంద్రం రెండుగా విభజించింది.

విశాఖపట్నం డివిజన్‌ను దక్షిణ తీర రైల్వే జోన్‌గా మార్చగా ఇందులో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు ఉంటాయి. విశాఖలో ఆఫీసులు, మౌలిక వసతుల కోసం కేంద్రం రూ.120 కోట్లు ఇవ్వగా, తాజాగా వెంటనే ఉద్యోగుల్ని సికింద్రాబాద్ నుంచీ వైజాగ్ తరలించాలని రైల్వే శాఖ ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 20 వేల మందికి పైగా ఉద్యోగులు ఉండగా, వాళ్లలో 10 వేల మంది విశాఖకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. వెళ్ళను అంటే బలవంతంగా అయినా పంపించాలని రైల్వే శాఖ భావిస్తుంది. ఈ నెల 20 తర్వాత సికింద్రాబాద్ నుంచీ వైజాగ్ వెళ్లబోతున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసే యోచనలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి రైల్వే శాఖ నిర్ణయం ఇప్పుడు ఫుల్ జోష్ ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news