సీఎం చంద్రబాబు నాయుడు తనపై సీరియస్ అయిన విషయము పై స్పందించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నో సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారని… రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని తెలిపారు మంత్రి సుభాష్. మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని వారికి దిశ నిర్దేశం చేసే పని నిరంతర ప్రక్రియగా సాగుతుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మాకు తండ్రి లాంటివార్నారు.
పిల్లలు ఏవైనా చిన్నపాటి పొరపాట్లు చేస్తే మందలించే బాధ్యత తండ్రికి ఎలా ఉందో.. మేము ఏమైనా పనిలో వెనుకబడినా .. పొరపాట్లు చేసినా మందలించే హక్కు చంద్రబాబు కి ఉందని వివరించారు మంత్రి సుభాష్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదుకు మేము కృషి చేస్తున్న ఓటర్లు పూర్తిస్థాయిలో నమోదు చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓటర్ నమోదు చేసే విషయమై ముఖ్యమంత్రి టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మాటలను ఎవరో గిట్టనివారు అసూయతో వాయిస్ రికార్డు చేసి బయటకు విడుదల చేయడం విచారకరం అంటూ ఆగ్రహించారు మంత్రి సుభాష్.