డొనాల్డ్ ట్రంప్ ‘సంపద’డబుల్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తన ప్రత్యర్థి కమలా హ్యారీస్‌ను దాటుకుని ట్రంప్ ముందంజలోకి వచ్చినట్లు పలు సర్వేలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ట్రంప్‌కు సంబంధించి మరో విషయం తాజాగా సంచలనంగా మారింది.

అక్టోబరు నెలలో ట్రంప్ నికర సంపద అకస్మాత్తుగా డబుల్ అయ్యింది. రూ.33 వేల కోట్ల నుంచి రూ.67వేల కోట్లకు పెరిగింది. ఫోర్బ్స్ ‘రియల్ టైం బిలియనీర్స్ ట్రాకర్’ ఈవిషయాన్ని వెల్లడించింది.ప్రస్తుతం ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో 357వ స్థానంలో ట్రంప్ ఉన్నారని సమాచారం.‘ట్రూత్ సోషల్’ పేరుతో ఓ సోషల్ మీడియా సంస్థను ట్రంప్ నడుపుతున్నారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ పరిధిలో ఆ సంస్థ పనిచేస్తుంది. తాజాగా ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ షేరు ధర దాదాపు 9 శాతం పెరిగి రూ.4,288కి చేరింది. ఈ కారణం వల్లే ట్రంప్ నికర సంపద విలువ అమాంతం పెరిగినట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news