చాలామంది ఎన్నో డబ్బులు పెట్టే కార్లు కొంటూ ఉంటారు. కానీ కార్లకి పదే పదే గీతలు పడుతూ ఉంటాయి. కార్లపై గీతలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి..? కార్లపై గీతలు పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి. కార్లపై గీతాలు పోగొట్టడానికి ప్రతిసారి పెయింట్ వెయ్యాలి. దానికి 1000, 2000 ఇలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కార్లపై గీతల్ని పడకుండా చూసుకోవడానికి కారు పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం ని ఉపయోగించండి. దీని వలన కారు పెయింట్ పోవడం కానీ గీతలు వంటివి పడడం కానీ జరగదు.
కారులపై గీతలు పడకుండా ఉండడానికి సిరామిక్ కోటింగ్ వేయండి. ఇది ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగ పనిచేస్తుంది. గీతల యొక్క ప్రభావం పెద్దగా కారుపై పడకుండా చూస్తుంది. ఎక్కువకాలం కారు షైనీగా ఉండేటట్టు చూస్తుంది. కారుపై గీతలు పడకుండా ఉండడానికి కారు కవర్ ని కూడా ఉపయోగించండి. దుమ్ము, ధూళి కూడా పడదు. అలాగే పక్షుల వలన కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఎప్పుడైనా సరే మీరు కారుని పార్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. చాలా ఎక్కువ కార్లు ఉన్నచోట పార్కింగ్ చేసేటప్పుడు లేదా అడ్డుగా ఏమైనా ఉన్నప్పుడు వాటికి తగిలే అవకాశం ఉంటుంది. ఖాళీ స్థలంలో పెడితే మంచిది. చిన్న చిన్న గీతలు వంటివి పడినప్పుడు గీతల్ని తొలగించే కిట్ ఉపయోగించండి. స్క్రాచ్ రిమూవల్ కిట్ వలన కూడా కార్ల పై గీతల్ని తగ్గించుకోవచ్చు. రెగ్యులర్ గా కారు వాష్ చేయించడం వలన కూడా కారుని క్లీన్ గా ఉంచుకోవచ్చు.