ఏపీ రాజధాని అమరావతి ఆందోళనలు రోజుకోరకంగా మలుపు తిరుగుతున్నాయి. రాజధాని రైతులకు అన్యా యం చేయొద్దని కోరుతూ.. ప్రారంభమైన ఆందోళన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనే వద్దనే రేంజ్ లో కొనసాగుతోంది. ఈ క్రమంలో పురుషులు ఆదిలో బాగానే పాల్గొన్నా.. పోలీసుల కేసులతో భయపడి.. మహి ళలను రంగంలోకి దింపారు. ఈ పరిణామం ప్రతిపక్షాలకు రెండు రకాలుగా లాభిస్తుండగా.. అధికార పక్షం వైసీపీకి మరో రెండు రకాలుగా ఇబ్బందిగా పరిణమించింది. మహిళలతో సెంటిమెంటును పండించుకునేం దుకు ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయనే టాక్ వస్తోంది.
అదేసమయంలో ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒకపక్క 144, పోలీస్ యాక్ట్ 30 వంటివి అమలు చేస్తున్నా.. కూడా మహిళలు రెచ్చిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క, ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తున్న మహిళలు.. మరి చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నారా? అంటే అది ఎంత మాత్రమూ కనిపించడం లేదు. 144 సెక్షన్‌ను ఉల్లంఘిస్తున్నారు. పోలీసులను నెట్టివేస్తున్నా రు. మరి ఇంత జరుగుతుంటే.. ప్రబుత్వం పక్షాన మాట్లాడేందుకు కూడా మంత్రులు కానీ, నాయకులు కానీ వెనుకడుగు వేస్తున్న పరిస్తితి కనిపిస్తోంది. ఏమైనా అంటే మహిళలను తిట్టిపోసిన ప్రభుత్వంగా ముద్ర వేసేందుకు ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి.
సరే! ఈ రగడ ఇలా ఉంటే.. అసలు మహిళలు ఇంతగా రోడ్డెక్కేందుకు ఎవరి ప్రోద్బలం ఉంది? నిజంగానే వీరంతా రైతులేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు క్షేత్రస్థాయిలో పరిశీలకులు. చంద్రబాబు సహా వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు వెనకాల ఉండి.. మహిళలను రెచ్చగొడు తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాలిటిక్స్ మేనేజ్‌మెంట్‌లో ఆరితేరిన చంద్రబాబు.. మహిళలను అడ్డు పెట్టుకుని ముందుకు సాగుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
అసలు అమరావతి ఉండదని కానీ, అమరావతిని తీసేస్తామని కానీ ప్రభుత్వం చెప్పేలేదు. మూడు రాజధానుల ఏర్పాటును మాత్రమే ప్రతిపాదించింది. మరి దీనిని అడ్డుకోవడం ఎందుకో అర్ధం కాని విషయంగా మారింది. అంటే, చంద్రబాబుకు కానీ, ఇతర పార్టీల నాయకులకు కానీ.. ఇతర ప్రాంతాల అభివృద్ది అవసరం లేదా? రాజధానిని జగన్ ఏమన్నా విదేశాల్లో ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడా? లేక రాజధానిని ఒక్కచోటే ఏర్పాటు చేయడం ద్వారా ఒక ప్రాంతమే అభివృద్ది చెంది.. మిగిలిన ప్రాంతాలను బూచిగా చూపించి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడా? మొత్తంగా చూస్తే.. రాజధాని వివాదంలో చంద్రబాబే చేస్తున్నవి జిమ్మిక్కులేనని అంటున్నారు విశ్లేషకులు.
ఇదే విషయంపై కేంద్రం కూడా స్పందించి.. అసలు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే ఇంత హంగామా చేస్తున్నాడా బాబూ! అంటూ బీజేపీ పెద్దలు చీదరించుకునే పరిస్థితి వచ్చిందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. మరి బాబు వ్యూహం మరోసారి కూడా బెడిసికొట్టి మహిళలు రోడ్డెక్కేందుకు కారణమైందని అంటున్నారు.