ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవ్.. మానవత్వం ఉంది : సీఎం చంద్రబాబు

-

ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవ్.. మానవత్వం మాత్రమే ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఈదుపురంలో దీపం-2 పథకాన్ని ప్రారంభించిన అనంతరం సభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయినప్పటికీ దేశంలో రూ.4వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా మానవత్వం ఉందని చెప్పారు. సిలిండర్ కు చెల్లించిన డబ్బులను 48 గంటల్లోనే రీఫండ్ చేస్తాం.

అసలు సిలిండర్ కు ముందే డబ్బు కట్టే పని లేకుండా ప్రయత్నిస్తున్నాం. డ్వాక్రా మహిళలకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. వారికి రివాల్వింగ్ ఫండ్, వడ్డీలేని రుణాలు ఇచ్చామని తెలిపారు. గతంలో ఎప్పుడూ చూడని విధ్వంసం చూశామని తెలిపారు. ఆడబిడ్డల పై వివక్ష ఉండేదన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామన్నారు.  టీడీపీ, కూటమి కార్యకర్తలకు అండగా ఉండే బాధ్యత నాది అన్నారు. ఇప్పుడు నాసిరకం మద్యం ఉండదు. ఇసుక పాలసీలో జోక్యం చేసుకుంటే పీడీయాక్ట్ లు పెడతామని హెచ్చరించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news