మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రెండవ దశ పనుల్లో భాగంగా ఐదు మార్గాల్లో పనులు జరగనున్నాయి. మొత్తం ఐదు మార్గాల్లో మెట్రో నిర్మాణం కానుంది. రెండవ దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 196 ని జారీ చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండవ దశ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 24, 269 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 7,313 కోట్లను వెచ్చించనుంది. అలాగే జికా, ఏడిబి, ఎన్డిబి వాట రూ. 11,693 కోట్లుగా ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభిస్తారు. ఇక రెండవ దశకు సంబంధించిన కారిడార్లు ఇలా ఉన్నాయి.
కారిడార్ – 4 లో నాగోల్ శంషాబాద్ 36.8 కిలోమీటర్లు
కారిడార్ – 5 లో రాయదుర్గం – కోకాపేట
కారిడార్ – 6 లో ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట
కారిడార్ – 7 లో మియాపూర్ – పఠాన్ చెరువు
కారిడార్ – 8 లో ఎల్బీనగర్ – హయత్ నగర్
కారిడార్ – 9 లో ఎయిర్ పోర్టు – ఫోర్త్ సిటీ ( 40 కిలోమీటర్లు)