జగన్ ప్రభుత్వం అందరికీ సమానమే – ఈ ఒక్క రుజువు చాలు .. !!

-

వైసిపి పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ తాను ప్రమాణస్వీకారం చేస్తున్న రోజే తన ప్రభుత్వం పార్టీలకు రాజకీయాలకు ప్రాంతాలకు కులాలకు మరియు మతాలకు అతీతంగా ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులు వారి కుటుంబ సభ్యులు గత కొన్ని రోజుల నుండి ఆందోళనలు నిరసనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. దీంతో ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది.

ఇటువంటి నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వికేంద్రీకరణ పేరిట వైయస్ జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి మద్దతుగా పెనుమాక నుండి గుంటూరు లోని తాడేపల్లి వద్ద భారత మాత విగ్రహం వరకు చేసిన పాదయాత్రలో పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ని అరెస్టు చేయడం జరిగింది.

 

ఇదే తరుణంలో గతంలో కూడా 144 సెక్షన్ రాజధాని ప్రాంతంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనలు నిరసనలు చేస్తున్న సందర్భంలో పోలీసులు అరెస్టు చేయడంతో తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అని పట్టించుకోకుండా పోలీసులు అరెస్టు చేయడంతో జగన్ ప్రభుత్వం అందరికీ సమానమే అన్నట్టుగా వ్యవహరిస్తుందని తాజాగా ఎమ్మెల్యే ఆర్కే అరెస్టయిన ఈ విషయంపై చాలా మంది సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రజలు కామెంట్ చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news