భూ కబ్జాలపై ప్రతి రోజూ వేల కొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి : మంత్రి అనగాని

-

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్.. రాష్ట్ర చరిత్రలో గొప్ప మైలురాయి అని రెవిన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ చట్టం భూములను కబ్జా చేసే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో వైసీపీ గూండాలు విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారు అని చెప్పిన మంత్రి అనగాని.. మా ప్రభుత్వానికి భూ కబ్జాలపై ప్రతి రోజూ వేల కొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి అన్నారు.

ఇక రాష్ట్రంలోని అన్ని రకాల భూములకు ఈ చట్టం వర్తిస్తుంది. కబ్జాలకు పాల్పడిన వారికి 10 నుండి 14 ఏళ్ల పాటు శిక్షతోపాటు భారీ స్థాయిలో అపరాధ రుసుము. కబ్జాదారునికి అక్రమాస్తులు ఉంటే వాటిని కూడా భూ కబ్జాలుగా పరిగణించి జప్తు చేస్తాం. భూ కబ్జా కేసుల కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తాం. బాధితులు కోర్టుకైనా వెళ్లవచ్చు లేదా కలెక్టర్ నాయకత్వంలోని కమిటీకైనా ఫిర్యాదు చేయవచ్చు అని అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news