గత ప్రభుత్వం అమరావతిని ఎడారి చేసింది. అమరావతిని కాపాడిన ఘనత ఆడబిడ్డలదేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా తాళ్లాయపాలెంలో పర్యటించిన చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో లక్షా 20వేల కోట్ల అప్పులు చేసింది. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్ర గల్లా పెట్టే ఖాలీ చేశారు. పేదలపై విద్యుత్ భారానికి కారణం గత ప్రభుత్వమే అన్నారు చంద్రబాబు.
మొత్తం రూ.10లక్షల కోట్ల అప్పు చేశారు. ఒక్క యూనిట్ కూడా వాడకుండా వేల కోట్లు చెల్లించారు. చరిత్రలో గుర్తుండి పోయేలా అమరావతి ఉద్యమం చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా డైవర్ట్ చేశారు. రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. వాల్లు చేసిన తప్పులకు ప్రజలు వాతలు పెట్టారు. పోలవరం డయఫ్రం వాల్ ను నాశనం చేశారు. విద్యుత్ చార్జీలను పెంచకుండా ఉండే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు సీఎం చంద్రబాబు.