కేవలం 11 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వస్తుందని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని సంస్థాగత ఎన్నికల వర్క్ షాపులో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలా తీశాయమని విమర్శించారు. సంస్థాగత ఎన్నికల వ్యవస్థ బీజేపీకి ఊపిరి అని.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి.
ఈనెల 15 వరకు సభ్యత్వ సేకరణ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అన్నారు. తెలంగాణలో సుమారు 35 లక్షల వరకు చేరుకుందని తెలిపారు. వివిధ స్థాయిల్లో బీజేపీ కమిటీలలో 30 శాతం కొత్త వారికి అవకాశం కల్పించారని తెలిపారు. బూత్ నుంచి జాతీయ స్థాయి వరకు సమర్థులైన వారితో కమిటీ వేసినట్టు వెల్లడించారు. బీజేపీలో కొత్త వారిని చేర్పించాలని.. భాగైస్వాములను చేయాలన్నారు. ఇతర పార్టీలు కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలు.. ఆ పార్టీలకు తరువాత ప్రెసిడెంట్ ఎవరు అవుతారో ముందే చెప్పొచ్చని తెలిపారు. కానీ బీజేపీ మాత్రం ప్రజాస్వామ్యంగా ముందుకెళ్తుందని తెలిపారు కిషన్ రెడ్డి.