అగ్రి గోల్డ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ వేసిన ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకుంది కోర్టు. 32 లక్షల ఖాతాదారుల నుంచి 6,380 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. ఇందులో 4,141 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా, అండమాన్ నికోబార్ లో ఉన్న ఆస్తులు అటాచ్ చేసారు. అగ్రిగోల్డ్ ఎండి అవ్వ వెంకట రామారావు, అవ్వ వెంకట శేషు నారాయణ, అవ్వ హేమ సుందర ల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ.
అయితే అగ్రి గోల్డ్ కేసులో 14 మందిని ఇప్పటికే అరెస్టు చేసిన ఈడీ.. 130 సెల్ కంపెనీల ద్వారా నిధులు బదలాయించినట్లు గుర్తించింది. అగ్రి గోల్డ్ డబ్బులను ఇతర ఖాతాలకు మళ్లించిన వెంకట రామారావు.. ఆ నిధులతో పవర్ రియల్ ఎస్టేట్ ఎంటర్టైన్మెంట్ ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టారు. పెద్ద మొత్తంలో లాభాలు ఇస్తున్నట్లుగా చూపెట్టి మోసం చేసిన అగ్రిగోల్డ్.. కోట్ల రూపాయల డబ్బులను సొంత ఆస్తుల కోసం మళ్లించారు అని ఈడీ పేర్కొంది.