వైసీపీ సోషల్ మీడియా సహా ఇతర సోషల్ మీడియా ప్రతినిధుల అక్రమ అరెస్టులపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసాడు విజయ్ బాబు అనే వ్యక్తి. ఆర్టికల్ 14, 19 ,21ని అతిక్రమించి అరెస్టు చేశారనీ పిటిషన్ లో పేర్కొన్నాడు. డీజీపీతో పాటు ఏడు మంది ఎస్పీలు, ఒక సీపీ, ఎనిమిది మంది సీఐలు అలాగే కొంతమంది పోలీసులు అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారనీ పేర్కొన్నాడు పిటిషనర్.
అయితే ఏడేళ్లు లోపు శిక్ష పడే కేసులకు 41 ఏ నోటీస్ ఇవ్వడం లేదు అని తెలిపిన విజయ్ బాబు.. మా వద్ద ఉన్న సోషల్ మీడియా అక్రమ కేసులకు సంబంధించిన కొన్ని ఎఫ్ఐఆర్ వివరాలు ఈ పిల్ పొందుపరుస్తున్నాం అని తెలిపాడు. అయితే సోషల్ మీడియా అక్రమ అరెస్టులకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం అందించాలి. చట్టానికి ,నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అరెస్టు చేసిన వారికి ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలిని పిల్ లో పేర్కొన్నాడు విజయ్ బాబు. ఇక వచ్చే బుధవారం ఈ పిటిషన్ పై విచారణ జరపనుంది హైకోర్టు.