రేవంత్ రెడ్డి ఆదానీ ద్వారా బీజేపీకి దగ్గర అయ్యారు : వివేకానంద

-

కులగణనలో అవసరం లేని సమాచారం అడుగుతున్నారు. సర్వే బీసీ కులగణన చేస్తున్నట్లుగా లేదు. ఉన్న పథకాలు పోతాయని ప్రజలు భయపడుతున్నారు అని BRS ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. కేసీఆర్ ఒక్కటే రోజు సమగ్ర కుటుంబ సర్వే చేశారు. కానీ కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేను రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే సర్వేపై అనుమానాలు ఉన్నాయి. 11 నెలల్లో ఒక్క మంచి పని రేవంత్ రెడ్డి చేయలేదు.

కేసులు పెడతామని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. కేసులకు బిఆర్ఎస్ పార్టీ భయపడదు. రాహుల్ గాంధీ ఆదానీ,మోదీని డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. రేవంత్ రెడ్డి ఆదానీ ద్వారా బీజేపీకి దగ్గర అయ్యారు. తెలంగాణ భూములు ఆదానీకి కట్టబెడుతున్నారు. ఆదానీ ద్వారా తెలంగాణ డబ్బులు ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు వెళ్తున్నాయి.. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే సోయి మర్చిపోయారు. బండి సంజయ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మోడీ ఫోటోతో బండి సంజయ్ రెండు సార్లు ఎంపీ అయ్యారు. ఆ బండి సంజయ్ రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతున్నారు అని వివేకానంద సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news