ఐ.ఎస్.జగన్నాథపురంలో అనుమతి లేని ప్రదేశంలో తవ్వకాలు చేపట్టారు. అనుమతులకు విరుద్ధంగా 20.95 ఎకరాల్లో 6 లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా రెడ్ గ్రావెల్ తవ్వకం జరిపారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం విచారణలో రెవెన్యూ, గనుల శాఖలో సంచలన విషయాలు బయటపడ్డాయి. అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 20.95 ఎకరాల్లో అక్రమ తవ్వకాలు చెప్పటింది. ఏ విధమైన అనుమతులు లేకుండా 6 లక్షల క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ తవ్వకం గుర్తించారు అధికారులు. దీపం-2 పధకం కోసం ఇటీవల ఐ.ఎస్.జగన్నాథపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కొండ సమీపంలో ఎర్ర కంకర తవ్వకం చూసి ఆరా తీశారు. తవ్వకాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశం ఇచ్చారు. ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలోని సర్వే నెంబర్ 425 లో 6.18 ఎకరాల్లో 74,875 క్యూబిక్ మీటర్లు తవ్వుకొనేందుకు అనుమతి ఉంది. కానీ అక్కడ ఎలాంటి తవ్వకాలు చేయలేదు. అదే సర్వే నెంబర్ లో మరోచోట 1.48 ఎకరాల్లో 36,107 క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకొని 33,637 క్యూబిక్ మీటర్లు తవ్వకం జరిపారు. అదే సర్వే నెంబర్ లో మరో చోట ఎలాంటి అనుమతులు లేకుండా 20.95 ఎకరాల్లో ఏ విధమైన అనుమతులు లేకుండా 6,15,683 క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ తవ్వకం చేసారు. దాంతో బెకెమ్ ఇన్ఫ్రా సంస్థకు నోటీసులు ఇస్తామని డిప్యూటీ సీఎం కార్యాలయానికి తెలిపిన జిల్లా కలెక్టర్.. ఇందుకు బాధ్యులైన రెవెన్యూ, గనుల శాఖల అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారు.