వైసీపీ నేతలపై థర్డ్ డిగ్రీ ఫాలో అవుతున్నారు : ఎంపీ అవినాష్ రెడ్డి

-

నా వ్యక్తిగత సహాయ కార్యదర్శి రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. ఫోన్ చేస్తే వచ్చే వ్యక్తిని పోలీసులుగా కాకుండా ఒక రౌడీలుగా వ్యవహరించడం సమంజసం కాదు అని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. వైసీపీ కార్యకర్తల ఇళ్లపై తలుపులు కొట్టి రౌడీయిజం చేసి అరెస్టు చేస్తామంటే చూస్తూ ఊరుకోం. పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల అరెస్టులు ఉంటాయని అంటున్నారు. టీడీపీ నాయకత్వం మాటలు విని పోలీసులు విర్రవీగు తున్నారు.. తగిన శాస్తి జరిగే విధంగా న్యాయపోరాటం చేస్తాం.

వైసీపీ నేతలపైన తప్పుడు కేసులు బనాయించాలని బెదిరిస్తున్నారు. థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఫాలో అవుతున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ డిఐజి చట్టప్రకారం నడుచుకోవాలి. చట్ట ప్రకారం కోర్టులో హాజరు పెట్టాలి. రాత్రిపూట ఇళ్ల మీద పడి దాడులు చేసి కార్యకర్తలు, నాయకులను,వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోం. కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.. ఎంత దూరమైనా పోరాడుదాం.. న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లి న్యాయపోరాటం చేద్దాం. భవిష్యత్తులో కచ్చితంగా అన్ని గుర్తుపెట్టుకుని తిరిగి సమాధానం చెబుదాం అని అవినాష్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news