ప్రదర్శన చేస్తూ మూర్చబోయిన సర్కస్ పులి

-

circus tiger has a seizure while performance

సర్కస్.. అంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే అక్కడ పులులు, సింహాలతో ఆడిస్తారు. అయితే.. ఇదివరకు సర్కస్ లాంటి షోలు నడిచేవి కానీ.. ఇప్పుడు జంతువులతో ఆడించడం తప్పని అటువంటి షోలను కొన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. అయినా.. కొన్ని చోట్లు సర్కస్ పేరుతో జంతువులను హింసిస్తూనే ఉన్నారు. తాజాగా రష్యాలో ఓ సర్కస్ షో జరుగుతున్న సమయంలో పులి మూర్చబోయింది. అచ్చం మనిషిలాగానే ఫిట్స్ వచ్చి మూర్చబోతుంది ఆ పులి.

సర్కస్ ట్రెయినర్ పులులతో షో చేస్తున్నాడు. మిగితా పులులు సర్కస్ ఫీట్లు చేస్తున్నా.. ఓ పులి మాత్రం చేయలేకపోయింది. అక్కడ పడిపోయి ఫిట్స్ వచ్చి మూర్చబోయింది. ఏం జరిగిందా అని ట్రెయినర్ దాన్ని అటూ ఇటూ కడ్డితో అన్నా అది లేవలేదు. అలాగే పడిపోవడంతో సర్కస్ చూడటానికి వచ్చిన వాళ్లంతా ఏం జరుగుతుందా అని ఆతృతగా చూశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news