తెలంగాణలో గత ఏడాది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పై అనర్హత పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ కేసు కి సంబంధించి హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. తీర్పు ఎప్పుడు వెలువడించేది తెలియదు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై షెడ్యూల్ ఖరారు చేయాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు వెలువడింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసారు అసెంబ్లీ కార్యదర్శి. రిజర్వ్ లో ఉండటంతో రేపు, మాపో తీర్పు రానుండటంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాస్త టెన్షన్ పడుతున్నారు. తమకు తీర్పు అనుకూలంగా వస్తుందో రాదోనని ఆందోళనలో ఉన్నట్టు సమాచారం.