లగిచర్ల ఘటనపై ఎంపీ రఘునందన్ రావు సీరియస్ అయ్యారు. కొడంగల్ లో తిరగబడ్డ రైతులు పార్టీల్లో ఉండకూడదా.. బరాబర్ ఉంటారు అని అన్నారు. అర్థరాత్రి రైతుల అరెస్ట్ ఏంది అని ప్రశ్నించారు. ఇక గతంలో కేసిఆర్ మల్లన్న సాగర్ బాధితులను అరెస్ట్ చేశారు. నేడు రేవంత్ లగిచర్ల లో అరెస్టులు చేసారు. ఇద్దరి విధానం ఒకేరకంగా ఉంది. రేవంత్ , కేటీఆర్ కు ఇద్దరికీ పని లేదు.. ఇద్దరు దొంగలే అన్నారు.
ఒకాయన ఢిల్లీ వెళ్లొచ్చక.. ఇంకొక్క ఆయన వెళ్తున్నాడు. రేవంత్, కేటీఆర్ తీరు నీవు గిచ్చినట్టు చెయ్ నేను ఏడ్చినట్టు చేస్తాను అనే విధంగా ఉంది. ఎవడు ఎక్కడైనా పొండి.. కానీ మా వడ్లు కొనండి. దళారుల పంచాయతీ తగ్గించండి. అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టొద్దు. ఒక్కాయన కార్లు ఆమ్మరా? ఇంకొక్క ఆయన ఓటుకు నోటు కేసులో దొరికారా? మీ పంచాయతీ మాకు అనవసరం. మీరు జంతర్ మంతర్ వద్ద తన్నుకున్న మాకు అనవసరం. కానీ వెంటనే వడ్ల కొనుగోలు చేయాలి అని రఘునందన్ రావు తెలిపారు.