హౌజ్ మెట్స్ రీ యూనియన్.. బిగ్ బాస్ హంగామా

-

all eliminated contestants surprise entry bigg boss 2

బిగ్ బాస్ హౌజ్ లో మరో రెండు రోజుల్లో ఫైనల్స్ కు వెళ్లనుండగా సర్ ప్రైజింగ్ గా మొదటి వారం నుండి ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన హౌజ్ మెట్స్ అందరిని ఇంట్లోకి పంపించారు. ఐగురు ఫైనల్ హౌజ్ మెట్స్ తో పాటుగా ఎలిమినేట్ అయిన 11 మంది ఇంట్లోకి వచ్చారు. ఒక్క నూతన్ నాయుడు మాత్రమే బిగ్ బాస్ హౌజ్ లోకి రాలేదు. దానికి కారణాలు రకరకాలుగా వినిపిస్తున్నాయి.

ఇక ఇంటి సభ్యులంతా సరదా సరదాగా గడిపారు. మొదటి ఎలిమినేటర్ సంజనా నుండి రీసెంట్ గా ఎలిమినేట్ అయిన రోల్ రైడా వరకు అందరు హౌజ్ లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ రీయూనియర్ బిగ్ బాస్ వీక్షకులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఫైనల్స్ కు ఒక్క రోజు మాత్రమే ఉండగా టైటిల్ విన్నర్ ఎవరై ఉంటారా అన్న ఎక్సైట్మెంట్ కూడా పెరిగింది.

టైటిల్ రేసులో ముగ్గురే ఉండాల్సి ఉండగా ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఐదుగురిలో ఇద్దరిని ఈరోజు ఇంటి నుండి బయటకు పంపిస్తారని అంటున్నారు. మరి హౌజ్ లో ఏం జరుగబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news