గుంటూరుజిల్లాపై గట్టిగా ఫోకస్ చేసిన వైసీపీ.. అందుకేనా ఆ మార్పులు..?

-

గుంటూరుజిల్లాలో బలోపేతంపై వైసీపీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టింది.. నియోజకవర్గాల వారీగా ఇన్చార్జులను నియమిస్తోంది.. ఆసక్తి ఉన్నవారికి అడిగిన చోట అవకాశమిస్తోంది.. మరికొన్ని చోట్ల బలమైన నేతలకోసం అన్వేషణ మొదలుపెట్టింది.. జిల్లాలో బలంగా ఉన్న టీడీపీని ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తోంది.. ఇంతకీ గుంటూరుజిల్లా రాజకీయాల్లో జరిగిన కీలక మార్పులేంటి..? వైసీపీ అనుసరిస్తున్న వ్యూహమేంటి..?

2024 ఎన్నికలకు ముందు సామాజికవర్గ సమీకరణాల పేరిట ఎమ్మెల్యేలను మార్చేసిన వైసీపీ.. ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది.. ఆ ప్రయోగం వర్కౌట్ అవ్వకపోవడంతో.. పాత నేతలనే నియోజకవర్గాలకు పంపుతోంది.. ఈ క్రమంలో చిలకలూరి పేట నియోకవర్గ బాధ్యతలను మాజీమంత్రి విడదల రజీనికి అప్పగించారు వైసీపీ అధినేత జగన్..2014-2019దాకా టీడీపీలో పనిచేసిన రజినీ.. ఆ తర్వాత వైసీపీలో చేరి పత్తిపాటి పుల్లారావ్ పై విజయం సాధించారు.. అనంతరం మంత్రి అయ్యారు..

నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదుగుతున్న సమయంలో.. సోషల్ ఇంజినీరింగ్ ను వైసీపీ అధినేత జగన్ తెరమీదకు తీసుకొచ్చారు.. సమీకరణాల్లో భాగంగా ఆమెను చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు పంపారు.. చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడికి టిక్కెట్ ఇచ్చారు..ఈ రెండు చోట్లా వైసీపీ ఓడిపోయింది..దీంతో జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారు.. రజినీని మళ్లీ చిలకలూరి పేటకు పంపారు..

గుంటూరుజిల్లా అధ్యక్షునిగా అంబటి రాంబాబును జిల్లా అధ్యక్షున్ని చేశారు.. తాటికొండ ఇన్చార్జిగా డైమండ్ బాబును నియమించారు.. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో వేమారెడ్డికి బాధ్యతలు ఇచ్చి.. మరికొన్ని నియోజకవర్గాలపై జగన్ ఫోకస్ పెట్టారు.. మిగిలిన వాటికి కూడా త్వరలో ఇన్చార్జులను ప్రకటించి.. పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారట..

Read more RELATED
Recommended to you

Latest news