టీడీపీ ఎమ్మెల్యే లు రాజీనామా ??

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం అమరావతి రాజధాని ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొని కనీసం అభివృద్ధికి నోచుకోని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందని ఇప్పటికిప్పుడు ఆర్థిక పరిస్థితి బట్టి చూస్తే రాజధాని కట్టడానికి కేంద్రం నుండి ఆర్థిక సాయం కూడా అంతంత మాత్రంగా ఉంటున్న నేపథ్యంలో ఆల్రెడీ అభివృద్ధి జరిగిన విశాఖ పట్టణం మరియు ఇతర ప్రాంతాలలో రాజధానిని విస్తరించితే బాగుంటుందని..ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వికేంద్రీకరణ అంశాన్ని సీఎం వైఎస్ జగన్ తెరపైకి తీసుకు రావడంతో.

అమరావతిలో రాజధాని లేకుండా జగన్ కుయుక్తులు పన్నుతున్నారని పార్వతి ప్రాంత ప్రజల చేత తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీ అధ్యక్షులు ఇటీవల ఆందోళనలు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఎటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం అందరూ ఒక్కసారిగా రాజీనామా చేసి ప్రజలలోకి వెళ్లి అమరావతి విషయాన్ని రెఫరెండం గా తీసుకుని భారీ మెజారిటీతో గెలిచి మాట్లాడితే బాగుంటుందని అంతేగాని పదవుల్లో ఉంటూ పోరాటాలు మరియు ఇంకా అనేక నిరసన కార్యక్రమాలు చేపడితే కేవలం రాష్ట్రం నష్టపోతుందని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

 

రాయ‌ల‌సీమ‌లో ముగ్గురు, కోస్తా-ఉత్త‌రాంధ్ర‌లో ఉన్న త‌న పార్టీ ఎమ్మెల్యేలంద‌రినీ ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు గెలిపిస్తే.. అప్పుడు ప్ర‌జ‌లు అమ‌రావ‌తికే క‌ట్టుబ‌డిన‌ట్టు. ఉత్తుత్తి ఉద్య‌మాల బ‌దులు చంద్ర‌బాబు నాయుడు ద‌మ్మూధైర్యంతో కూడిన రాజీనామాల రాజ‌కీయం చేస్తే.. అప్పుడు ఆయ‌న‌లోని స‌త్తా ఏమిటో బ‌య‌ట‌ప‌డుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  

Read more RELATED
Recommended to you

Latest news