మాజీ MLA తాటికొండ రాజయ్య సూటిగా సవాల్ విసిరాడు MLA కడియం శ్రీహరి. అవినీతికి పాల్పడ్డట్టు సాక్ష్యాలతో నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న కడియం శ్రీహరి.. శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పకుంటాను అని తెలిపారు. ఒకవేళ నిరూపించ లేకపోతే, దళిత బంధు పేరుతో వందలాదిమంది పేద, దళిత బిడ్డలను ఏ విధంగా మోసం చేశావో సాక్షాలతో ప్రజలు, మీడియా ముందు నిరూపిస్తాను. నువ్వు రాజకీయాలనుంచి తప్పుకుంటావా రాజయ్య అని ఛాలెంజ్ చేసారు.
రాజయ్యకు ఏమాత్రం ధైర్యం ఉన్నా ఈ సవాల్ ను ఒప్పుకోవాలి. అవినీతికి కేరాఫ్ కల్వకుంట్ల కుటుంబం. కేటీఆర్ జైలు భయంతో ప్రజల సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారు. కేసీఆర్, హరీశ్ రావులు కాలేశ్వరం అవకతవకలపై కమిషన్ ముందు హాజరుకాక తప్పదు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎకరం భూమి కబ్జా చేసిన చరిత్ర లేదన్నారు కడియం శ్రీహరి. స్టేషన్ ఘన్పూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేసారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.