గత రెండు రోజుల నుంచి బంగారం ధర భారీగా పతనమవుతూ వస్తోంది. అయితే బంగారం ధర గురువారం స్వల్పంగా పైకి కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరుగుదలతో రూ.37,650కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.41,070కు కదిలింది. సానుకూల అంతర్జాతీయ ట్రెండ్ ధర పెరుగుదలకు కారణం. కేజీ వెండి ధర ఈ రోజు రూ.100 పెరుగుదలతో రూ.49,000కు ఎగసింది.
ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పైకి కదిలింది. దీంతో ధర రూ.38,460కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదల నమోదు చేసింది. దీంతో రూ.39,660కు పెరిగింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.49,000కు ఎగసింది.