సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో పాల్గొన మంత్రి దామోదర రాజనర్సింహ కీలక కామెంట్స్ చేసారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ పదేళ్లలో నిరంకుశ పాలనపై పోరాడాడు. 60 ఏళ్ల సుధీర్ఘ ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం కోసం సోనియాగాంధీ గుర్తించి రాష్ట్రం ఇచ్చింది. మహాలక్ష్మీ పథకానికి 3600 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని మంత్రి పేర్కొన్నారు.
అలాగే ప్రతి పేదవాడికి వ్యవసాయ భూమి, ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని తెలిపిన మంత్రి.. వచ్చే ఏ ఎన్నికలయిన కాంగ్రెస్ పార్టీనే గెలిచే విదంగా కృషి చేయాలి. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక. ఏ పార్టీ అయిన కార్యకర్తని విస్మరిస్తే ఆ పార్టీ పని అయిపోయినట్టే అన్నారు. అలాగే రాష్ట్రంలో కులగణన జరగాలి అందరికి సంక్షేమ పథకాలు అందాలి. ఇప్పటి వరకు 54 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా జాబ్ క్యాలెండర్ కచ్చితంగా అమలు చేసి తీరుతాం అని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.