టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం.. రాజకీయ ప్రసంగాలు పై ఆంక్షలు..!

-

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి భక్తులకు రెండు,మూడు గంటల సమయంలోనే దర్శనం కల్పిస్తాం అని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అన్యమతస్థ ఉద్యోగులను ప్రభుత్వ శాఖలోకి బదిలి చేస్తాం. తిరుమలలో వున్న వ్యర్థపదార్థాలను రెండు, మూడు నెలల కాలంలో తరలిస్తాం. తిరుపతిలో వున్న ప్లై ఓవర్ కి తిరిగి గరుడ వారధిగా నామకరణం చేసాం. అలిపిరి వద్ద టూరిజం శాఖకు కేటాయించిన 20 ఏకరాల స్థలంలో నిర్మించి తలపెట్టిన ముంతాజ్ హోటల్ ని నిలిపి వేసి….ఆ స్థలాని టిటిడికి అప్పగించాలని ప్రభుత్వాని కోరతాం.

అలాగే తిరుమలలో రాజకీయ ప్రసంగాలు పై ఆంక్షలు విధించాం. స్థానికులుకు గతంలో లాగానే మొదటి మంగళవారం దర్శనం కల్పించే విధానాన్ని పున:రుద్దరణ చేస్తాం. శ్రీవాణి ట్రస్ట్ ని రద్దు చేసి….ఆ స్కింని మాత్రం కోనసాగిస్తాం. ప్రవైట్ బ్యాంకులో వున్న డిపాజిట్లను తిరిగి ప్రభుత్వ బ్యాంకులోకి మల్లిస్తాం. అన్నప్రసాదంలో భక్తులుకు అందించే మెనులో అదనంగా కోన్ని పదార్దాలు చేరుస్తాం. లడ్డు ప్రసాదంలో వినియోగించే పదార్దాల నాణ్యత పెంపుకి నిపుణులు కమిటి ఏర్పాటు చేస్తాం. ఇక బ్రహ్మోత్సవం బహుమానంగా ఉద్యోగులుగా 15400 అందిస్తాం. శారదా పిఠంకు కేటాయించిన స్థలాని రద్దు చేసి టిటిడి స్వాధీనం చేసుకుంటుంది. అలాగే టూరిజం శాఖకు కేటాయించే టిక్కెట్ల విధానాన్ని రద్దు చేసాం అని చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news