జమిలి ఎన్నికలు వస్తే.. వారు కలిసే పోటీ చేస్తారా..? జనసేన రహస్య అజెండా ఏంటంటే..

-

మూడు పార్టీలు కలిసి.. గత ఎన్నికల్లో వైసీపీ మీద పోటీ చేశాయి.. కూటమి అభ్యర్దులు మంచి మెజార్టీతో గెలుపొందారు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల వైపు వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. ఈ మూడు పార్టీలు మళ్లీ కలిసే పోటీ చేస్తాయా..? లేక పవన్ బిజేపీతో ఉంటారా..అనే చర్చ ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతోంది..

బిజేపీకి పవన్ కళ్యాణ్ ఇష్టమైన స్నేహితుడు.. పవన్ కళ్యాణ్ చొరవతోనే మూడు పార్టీలు గత ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.. టీడీపీకి-బిజేపీకి మధ్య పొత్తు కుదిర్చింది పవన్ కళ్యాణే అన్న ప్రచారం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది.. కూటమి అధికారంలోకి రావడతో ఇప్పుడు చంద్రబాబు కేంద్రంతో సన్నిహితంగా ఉన్నారు.. అయితే కేంద్రంలో ప్రధాని మోడీ జమిలి ఎన్నికల ప్రతిపాదనను తీసుకొచ్చారు.. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగితే.. అన్ని రాష్టాలు అభివృద్ది చెందుతాయన్న ఆలోచన ఆయనది..

మోడీ ప్రతిపాదనకు కూటమి పార్టీలన్నీ ఒకే చెప్పాయి.. దీంతో 2029లో ఎన్నికలు రావొచ్చన్న ప్రచారం జరుగుతోంది.. ఈ క్రమంలో టీడీపీ, బిజేపీ, జనసేన వచ్చె ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయా అన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.. ఎందుకంటే.. గత ఎన్నికల్లో జనసేనకు చాలా తక్కువ సీట్లు ఇచ్చారు.. దీంతో ఆ పార్టీలో కొందరు అసంతృప్తిని వ్యక్తం చేసినా.. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెంటే నడిచారు..

గత ఎన్నికల్లో జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో గెలిచింది.. దాంతోపాటు.. టీడీపీ అభ్యర్దులను గెలిపించడంలో పవన్ కళ్యాణ్‌ పాత్ర కూడా ఉంది.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మళ్లీ టీడీపీతో కలుస్తారా..లేక బిజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి వెళ్తారా అన్న సందేహం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.. ప్రధాని నరేంద్రమోడీ పవన్ కళ్యాణ్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.. మోడీ పిలుపుతో మహారాష్టలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ పాల్గొన్నారు.. దీంతో వారిద్దరి మద్య మంచి సంబంధాలున్నాయి..

జమిలి ఎన్నికల నాటికి ఏపీలో పూర్తిస్తాయిలో బలం పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు..అందులో భాగంగానే వైసీపీలో ఉండే కీలక నేతల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు.. జమిలి ఎన్నికల నాటికి జనసేన బలపడితే.. టీడీపీతో కలిసి ఎన్నికలకు వస్తుందా..లేక బిజేపీతో పొత్తు పెట్టుకుంటుందా అనేది రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్న చర్చ.. మరోపక్క చంద్రబాబు మాత్రం.. కూటమికి కంటిన్యూ అవుతుందని.. తమ మధ్య ఎలాంటి భేదాబిప్రాయాలు లేవని చెబుతున్నారు.. సో మొత్తంగా.. ఈ చర్చలకు పుల్ స్టాప్ పడాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news