కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. జీవో నెం.16ను కొట్టేసింది హైకోర్టు. ఈ జీవో ద్వారా వేలాది మందిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. తాజా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ తో ఆందోళనలో ఉన్నారు రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులు.
మరోవైపు అధికారులు మాత్రం కోర్టు ఆర్డర్ కాపీ వస్తే కానీ ఓ క్లారిటీ వస్తుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం రెగ్యులరైజ్ అయిన వారి విషయంలో కోర్టు తీర్పులో ఏమి ఉందో చూడాలని అంటున్నారు అదికారులు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు ప్రధానంగా ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టు గా పని చేసిన మమ్ముల్ని ప్రభుత్వం మురిసిన కొద్ది రోజులకే కోర్టు జీవో నెం.16 ను కొట్టేయడంతో ఆందోళన లో పడ్డారు.