వరంగల్ ఒక్క పట్టణానికి 6 వేల కోట్ల పనులను మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఇది అని డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వరంగల్ పట్టణాన్ని మహా నగరాన్ని చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్నాం. ఉక్కు మనిషి ఇందిరా గాంధీ. పుట్టిన రోజు సందర్బంగా రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన సందర్భంగా విజయోత్సవ చేపడుతున్నము. మహిళ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే ఆలోచనలో అన్ని ఆ నాటి ఇందిరమ్మ ప్రభుత్వం లో తెచ్చినవే. అలాంటి సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం తీసేసింది.
కానీ మహిళ సంఘాలకు రుణాలు ఇవ్వడమే కాదు.. వాటితో వ్యాపారం చేసిన మహిళ సంఘాలను బలోపేతం చేసే ఆలోచనలు చేస్తోంది. మహిళ సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పెట్టి ఆ విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం కొని వారికి లాభాలు వచ్చే లా ఆలోచనలు చేసిన ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మహిళ ప్రభుత్వం. మేము ఇచ్చింది చుకోండి. మేము ఇచ్చింది చుస్తే కొందరికి కళ్ళు తిరుగుతాయి అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.