కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలు అవసరలు ఏం ఉన్నాయో తెలుసుకొండి అని ముఖ్యమంత్రి మాకు చెప్పిండు అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. అయితే లగచర్లలో జరిగింది ఒక కుట్ర. అక్కడ అవుటి శేఖర్ ను బందించారు. కలెక్టర్ ను చంపడానికే ప్లాన్ చేసారు. ఒకవేళ కలెక్టర్ చంపితే గన్ మెన్ ఫైరింగ్ చేస్తాడు. అప్పుడు పెద్ద ఎత్తున అలర్లు సృష్టించాలని చూసారు అని పరిగి ఎమ్మెల్యే అన్నారు.
అసలు సురేష్ ది ఒక రైతు కుటుంబమే కాదు. మణికొండలో విలసా వంత మైన విల్లాలో ఉంటాడు. షర్ట్ ఫీలిమ్స్ తీస్తాడు. సురేష్ వాళ్ళ మామకు కూడా BRS పార్టీతో అనుసంధానం ఉంది. అందువల్లనే సురేష్ కు BRS యూత్ ప్రసిండెంట్ పదవి ఇచ్చారు. సురేష్ రైతుగా కలెక్టర్ ముందు గొప్పగా యాక్టింగ్ చేసాడు. అయితే సురేష్ యాక్టింగ్ నమ్మిన కలెక్టర్ నిజంగా రైతు అనుకోని గ్రామనికి వెళ్లి రైతులతో మాట్లాడుదాం అని వచ్చాడు అని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.