300 కోట్లతో మంచిర్యాలలో ఆస్పత్రి నీ నిర్మిస్తున్నాం. మహారాష్ట్రతో పాటు ఈ జిల్లాకు మెరుగైన వైద్యం అందిస్తాం అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి విద్య, వైద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ప్రభుత్వాలు హామీలకే పరిమితం అయ్యారు. ఇక్కడ నిర్మాణంతో పాటు వైద్య సిబ్బందిని కూడా నియమిస్తున్నం. 200 కోట్లతో కరకట్టల నిర్మాణం చేస్తున్నాం. మరో 40 కోట్లను విద్యకు కేటాయించాం అని మంత్రి తెలిపారు.
ఇక ఈ నియోజక వర్గానికి 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాం. ఇంటి గ్రేటెడ్ పాఠశాల తీసుకువచ్చిన ఘనత మీ MLAది. BRS మరియు బీజేపీ పార్టీలు పదేళ్ల కాలం ఏం చేయలేదు. ఇప్పుడు మేము చేస్తుంటే.. ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీ లను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. 18 వేల కోట్ల రుణమాఫీ చేసినం వరి కి 500 బోనస్ ఇస్తున్నాం. కొత్తగనులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నాం. నైనీ బొగ్గు బ్లాక్ లను సింగరేణి వచ్చేలా కృషి చేస్తుంటే.. BRS నాయకులు ఏం పని చేశారని విమర్శించడం సరికాదు అంటూ తెలిపాడు శ్రీధర్ బాబు.