ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని కి ఊహించని షాక్ తగిలింది. అమరావతి విషయంలో వైసీపీ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మద్రాస్ ఐఐటీ స్పష్టం చేసింది. అమరావతి ప్రాంతంలో ఉన్న నేల వ్యవసాయానికి ఆధారమైన నేల అంటూ అక్కడ భారీ భవనాల నిర్మాణాలకు అనుకూలం కాదు అంటూ బోస్టన్ కమిటీ తన నివేదికలో పేర్కొన్న అంశాన్ని తప్పుబట్టింది.
అమరావతి ప్రాంతంలో భారీ నిర్మాణ భవనాలు చేపడితే ఖర్చు అధికమవుతుందని వైసీపీ నేతలు చేసిన కామెంట్లను ఐఐటీ మద్రాస్ పేరిట కొన్ని పత్రికలలో వచ్చిన కథనాలను తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది ఐఐటీ మద్రాస్. అమరావతి రాజధానిగా సురక్షితం కాదని ఇచ్చిన నివేదిక రాంగ్ అని ఆ విషయాన్ని రాజధాని రైతులకు మెయిల్ చేసి మరి ఐఐటీ మద్రాస్ తెలిపింది.
నేలలో బలం లేదని ఆ సంస్థ తరుపున వచ్చిన నివేదిక అబద్ధమని అమరావతిపై అలాంటి నివేదిక ఇవ్వాలంటే మెటీరియాలజీ విభాగం ఉండాలని, తమ సంస్థలో అలాంటి విభాగమే లేదని ఐఐటీ మద్రాస్ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ వ్యాఖ్యలు విన్న అమరావతి జేఏసీ కావాలని వైయస్ జగన్ సర్కార్ అమరావతి రాజధాని పై దుష్ప్రచారం చేస్తోందని దీనిపై ప్రభుత్వ పెద్దలు క్లారిటీ ఇవ్వాలని అమరావతి జేఏసీ కోరింది.