ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించింది భారత ప్రభుత్వం. ఈ విషయం ఎప్పటి నుండో వార్తల్లో ఉన్న ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. సెక్యూరిటీ కారణాల వల్ల పాకిస్థాన్ కి భారత్ వెళ్ళడం కుదరదు అని MEA అధికారి తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ తటస్థ వేదికపై నిర్వహించాలని.. హైబ్రిడ్ పద్ధతి ని ప్రతిపాదించింది భారత్. కానీ PCB చైర్మన్ నఖ్వీ హైబ్రిడ్ మోడల్ కు ససేమిరా అంటున్నారు.
టీమిండియా లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తాం అని పాక్ క్రికెట్ బోర్డు పేర్కొంది. రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సెక్యూరిటీ కారణాల వల్ల అనుమతి ఇవ్వడం కుదరదు అని తెలిపిన MEA ఈ టోర్నీ కోసం 3 ప్రతిపాదనలు ఐసీసీ ముందు ఉంచింది. టీం ఇండియా మినహా మిగతా అన్ని మ్యాచ్లు పాకిస్థాన్లో జరగాలి లేదా టోర్నమెంట్ పూర్తిగా పాకిస్తాన్ వెలుపల జరగాలి. హోస్టింగ్ హక్కులు మాత్రం PCB వద్ద ఉండాలి లేదా భారత్ లేకుండానే ట్రోఫీ నిర్వహించుకోవాలి అని స్పష్టం చేసింది.